ఎస్ఈసీగా రమేశ్‌కుమార్‌ను తిరిగి నియమించాలన్న హైకోర్టు తీర్పుపై పిటిషనర్ కామినేని శ్రీనివాస్ స్పందన
- ప్రభుత్వం చేసింది రాజ్యాంగ ఉల్లంఘనే
- జేడీ నడ్డా అనుమతితోనే పిటిషన్ వేశా
- కరోనా నేపథ్యంలో ఎస్ఈసీ ఎన్నికలు వాయిదా వేశారు
- ఎవరైనా ఏదైనా చేసినప్పుడు ఇకనైనా జగన్ పాజిటివ్ గా తీసుకోవాలి
కరోనా విజృంభణ జరుగుతోన్న సమయంలో ఆ విషయాన్ని తీసిపారేస్తూ ఏపీ ప్రభుత్వం మొదట్లో వ్యవహరించిన తీరు తీవ్ర అభ్యంతరంగా ఉందని కామినేని తెలిపారు. కరోనా నేపథ్యంలో ఎస్ఈసీ ఎన్నికలు వాయిదా వేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన సమర్థించారు. ఎవరైనా ఏదైనా చేసినప్పుడు ఇకనైనా పాజిటివ్ గా తీసుకోవాలని ఆయన సీఎం జగన్‌కు విజ్ఞప్తి చేశారు.