Donald Trump: ప్రధాని మోదీతో ట్రంప్ మాట్లాడలేదు.. కేంద్ర ఉన్నత స్థాయి వర్గాల వివరణ!

There has been no recent contact bw PM Modi US President Trump
  • మోదీతో మాట్లాడానంటూ ట్రంప్ వ్యాఖ్యలు
  • చివరి సారిగా ఏప్రిల్ 4న మాట్లాడుకున్నారన్న వర్గాలు  
  • అప్పుడు హైడ్రాక్సీ క్లోరోక్విన్ గురించి మాట్లాడుకున్నారు
భారత్‌-చైనా మధ్య చోటు చేసుకుంటున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తాను ప్రధాని మోదీతో మాట్లాడానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఉన్నత స్థాయి వర్గాలు స్పందించాయి. చైనా అంశంపై మోదీతో ట్రంప్ మాట్లాడలేదని వారు పేర్కొన్నారు.

ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ చివరి సారిగా ఈ ఏడాది ఏప్రిల్ 4న  హైడ్రాక్సీక్లోరోక్విన్ గురించి మాట్లాడుకున్నారని తెలిపారు. చైనాతో ఏర్పడిన వివాదం పట్ల నేరుగా ఆ దేశంతోనే దౌత్యపరమైన చర్చలు, సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటామని చెప్పారు.  

కాగా, నిన్న శ్వేతసౌధంలో మాట్లాడిన ట్రంప్‌.. భారత్, చైనా సరిహద్దు వివాదంలో మధ్యవర్తిగా ఉండేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. గతంలోనూ కశ్మీర్‌ అంశంలో పాక్‌-భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినప్పుడు ట్రంప్ ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. ఆయన చేస్తోన్న వ్యాఖ్యలను భారత్‌ సున్నితంగా తిరస్కరించింది.
Donald Trump
India
China

More Telugu News