అత్యవసర పరిస్థితిని ఎత్తేసిన జపాన్.. రూ. 70 లక్షల కోట్లతో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటన
- కరోనాను అద్భుతంగా కట్టడి చేసిన జపాన్
- మొత్తంగా రూ. 150 లక్షల కోట్ల కేటాయింపు
- కోవిడ్‌పై పోరులో అత్యధికంగా ఖర్చు చేస్తున్న అమెరికా తర్వాతి స్థానంలో జపాన్
గత నెలలో లక్ష ట్రిలియన్ డాలర్లను ప్రటించిన జపాన్ తాజాగా, మరో 1.1 ట్రిలియన్ డాలర్లు ప్రకటించింది. దీంతో ఉద్దీపన ప్యాకేజీ మొత్తం రూ. 150 లక్షల కోట్లకు చేరింది. ఫలితంగా కరోనా వైరస్‌పై పోరుకు అత్యధికంగా ఖర్చు చేస్తున్న దేశాల్లో అమెరికా సరసన జపాన్ చేరింది. అమెరికా కూడా దాదాపు 2.3 ట్రిలియన్ డాలర్లను కేటాయించింది. కాగా, కరోనాను జపాన్ అద్భుతంగా కట్టడి చేసింది. ఆ దేశంలో ఇప్పటి వరకు కేవలం 17 వేల కేసులే నమోదు కాగా, 825 మంది మాత్రమే చనిపోయారు.