Ram Gopal Varma: 'కరోనా వైరస్'... రామ్ గోపాల్ వర్మ కొత్త చిత్రం ఇదే!

Ram Gopal Varma made Corona Virus movie in lock down period
  • లాక్ డౌన్ కాలంలో చిత్రీకరించినట్టు వెల్లడి
  • కరోనా సబ్జెక్టుతో ప్రపంచంలో ఇదే తొలి చిత్రమన్న వర్మ
  • రేపు సాయంత్రం ట్రైలర్
సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి కలకలం రేపారు. తాను ఈ లాక్ డౌన్ కాలంలో 'కరోనా వైరస్' అనే సినిమా తీశానని ప్రకటించారు. ఈ సినిమా యావత్తూ లాక్ డౌన్ కాలంలోనే తెరకెక్కించామని వెల్లడించారు. కరోనా వైరస్ సబ్జెక్టుపై ప్రపంచంలో ఇదే తొలి చిత్రం అవుతుందని వర్మ పేర్కొన్నారు. తమ చిత్రంలోని నటీనటులు, సిబ్బంది సృజనాత్మకత చాటుకున్నారని, లాక్ డౌన్ కాలంలో వారి క్రియేటివిటీకి లాక్ డౌన్ లేకుండాపోయిందని చమత్కరించారు. ఈ చిత్రం ట్రైలర్ రేపు సాయంత్రం 5 గంటలకు రిలీజ్ అవుతుందని వర్మ ట్వీట్ చేశారు.

Ram Gopal Varma
Corona Virus
Movie
Lockdown
Trailer

More Telugu News