amritam: ప్లాన్లు వేసి ‘అమృతం’ ప్రారంభించాం.. కానీ, భగవంతుడు మరొకటి ప్లాన్ చేశాడు: ఎల్బీ శ్రీరాం
- 'లాక్‌డౌన్' స్పెషల్ పేరుతో రెండు ప్రత్యేక ఎపిసోడ్‌ల చిత్రీకరణ
- ఈ సందర్భంగా మాట్లాడిన ఎల్బీ శ్రీరాం
- 'గాడ్'తో పాటు 'అమృతం'లో నటించడం గర్వకారణం
సూపర్ హిట్ కామెడీ సీరియల్ అమృతం మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. నటులు హర్షవర్ధన్ అమృతంగా, ఎల్బీ శ్రీరామ్ అంజిగా 'అమృతం ద్వితీయం' ఉగాదికి జీ5 ఓటీటీ వేదికగా విడుదలైంది. దీనికి ప్రేక్షకుల నుంచి మరోసారి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు కరోనా 'లాక్‌డౌన్' స్పెషల్ పేరుతో రెండు ప్రత్యేక ఎపిసోడ్‌లను తీశారు.
ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఎల్బీ శ్రీరాం మాట్లాడారు. 'గాడ్'తో పాటు 'అమృతం' వంటి ప్రాజెక్టులలో నటించే అవకాశం తనకు లభించడం పట్ల గర్వంగా ఉందని చెప్పారు. తాము ఎన్నో ప్లాన్లు వేసి రెండు నెలల క్రితం అమృతం ప్రారంభించామని, అయితే, భగవంతుడు మాత్రం మరొకటి ప్లాన్ చేశాడని ఆయన వాపోయారు. కాగా, 'లాక్‌డౌన్' ఎత్తేసిన అనంతరం అమృతంలోని మిగతా ఎపిసోడ్లను ప్రసారం చేస్తామని దర్శకుడు సందీప్ గుణ్ణం తెలిపారు.