Maharashtra: కరోనా బారిన ‘మహా’ మంత్రులు.. మాజీ సీఎం అశోక్ చవాన్‌కు కరోనా పాజిటివ్!

Former Maharashtra CM Ashok Chavan tests positive for coronavirus
  • మొన్న జితేంద్ర అవద్.. నేడు చవాన్
  • చికిత్స తీసుకుంటున్న మంత్రి
  • మహారాష్ట్రలో 50 వేల మార్కును దాటేసిన కేసులు
మహారాష్ట్ర కేబినెట్ మినిస్టర్, మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కరోనా మహమ్మారి బారినపడ్డారు. కాంగ్రెస్ నేత అయిన చవాన్ ప్రస్తుతం ఉద్ధవ్ కేబినెట్‌లో పీడ్ల్యూడీ మంత్రిగా ఉన్నారు. మంత్రి తరచూ ముంబై నుంచి తన స్వగ్రామమైన మరఠ్వాడాకు వెళ్లి వస్తుంటారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయనకు వైరస్ సంక్రమించి ఉంటుందని అనుమానిస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే ఆయనకు వైరస్ సోకిందని, ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటున్నారని ఓ అధికారి తెలిపారు. కాగా, ఎన్సీపీ నేత, గృహ నిర్మాణ మంత్రి అయిన జితేంద్ర అవద్ కూడా కరోనా బారినపడ్డారు. రెండు వారాలపాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న తర్వాత ఆయన కోలుకున్నారు.
 
మహారాష్ట్రలో నిన్నటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేల మార్కును దాటి 50,231గా నమోదైంది. నిన్న ఒక్క రోజే 3,041 కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం మహారాష్ట్రలో ఇదే తొలిసారి. అలాగే, 58 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,635కు చేరింది. తాజాగా మరణించిన వారిలో 39 మంది ముంబైకి చెందినవారు కావడం గమనార్హం.
Maharashtra
Ashok Chavan
corona virus

More Telugu News