భారత్ లో కరోనా వ్యాక్సిన్ పరిశోధనలు ముమ్మరం.. ఒకటి కాదు నాలుగు వస్తున్నాయి!
- ప్రపంచవ్యాప్తంగా 100 వ్యాక్సిన్లపై పరిశోధనలు
- భారత్ లో 14 వ్యాక్సిన్లపై ప్రయోగాలు
- వాటిలో 4 మెరుగైన ఫలితాలు ఇస్తున్నాయన్న కేంద్రం
- త్వరలోనే మనుషులపై ప్రయోగం
ఈ ప్రక్రియలో భాగంగా ఆ వ్యాక్సిన్లను వివిధ వయసులున్న మనుషులపై ప్రయోగిస్తారని, ఆపై వచ్చే ఫలితాల ఆధారంగా వాటి పురోగతి ఆధారపడి ఉంటుందని వివరించారు. రాబోయే ఐదు నెలల్లో ఈ ప్రక్రియ జరుగుతుందని వివరించారు. ఏదేమైనా కరోనా వ్యాక్సిన్ వచ్చేసరికి సుదీర్ఘ సమయం పడుతుందని హర్షవర్ధన్ తెలిపారు. ఓ వ్యాక్సిన్ అన్నివిధాలా సిద్ధం కావడానికి కనీసం ఏడాది సమయం పట్టొచ్చని అభిప్రాయపడ్డారు. అప్పటికీ వ్యాక్సిన్ రాని నేపథ్యంలో... భౌతికదూరం, శానిటైజర్లు, ఫేస్ మాస్కులతో కరోనాను ఆమడదూరంలో ఉంచొచ్చని అన్నారు.