ఏపీలో మరో 66 మందికి కరోనా నిర్ధారణ

ఆంధ్రప్రదేశ్‌లో పరీక్షలు నిర్వహిస్తోన్న కొద్దీ కరోనా వైరస్ కేసులు భారీగా బయటపడుతున్నాయి. గత 24 గంటల్లో 11,357 శాంపిళ్లను పరీక్షించగా మరో 66 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో 29 మంది డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపింది.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 2,627 అని తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 764 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 1,807 మంది డిశ్చార్జ్ అయ్యారు.  మృతుల సంఖ్య మొత్తం 56కి చేరింది


More Telugu News