Viral Videos: మెరుపు వేగంతో పరిగెత్తిన జింక జాతికి చెందిన గెజెల్‌.. వీడియో వైరల్

Cheetah chases gazelle in incredible viral video
  • వీడియో పోస్ట్ చేసిన ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ అధికారి  
  • చిరుత నుంచి తప్పించుకునేందుకు గెజెల్ ప్రయత్నాలు
  • అద్భుతమంటోన్న నెటిజన్లు
మెరుపు వేగంతో పరిగెత్తిన జింక జాతికి చెందిన గెజెల్‌కు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ‌గెజెల్‌ను చంపి తినడానికి ఓ చిరుత దాని వెనుక పరుగులు తీసింది. అయితే, అంతకన్నా వేగంగా పరిగెత్తి దాని నుంచి గెజెల్‌ తప్పించుకునే ప్రయత్నాలు చేసింది. చిరుత ఎంతగా ప్రయత్నించినప్పటికీ దాని కన్నా వేగంగా పరిగెత్తడానికి గెజెల్ చేసిన ప్రయత్నం అద్భుతమనిపిస్తోంది.

ప్రపంచంలోనే అత్యధిక వేగంగా పరిగెడుతుందని చిరుతకి పేరు ఉంది. అయితే, దాని కంటే వేగంగా పరిగెత్తి గెజెల్ తన ప్రాణాలను రక్షించుకోవడానికి చేసిన ప్రయత్నాలు అద్భుతమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ అధికారి సుషాంత నంద తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు.  

Viral Videos
India

More Telugu News