IMD: మండిపోతున్న ఎండలు... మరో నాలుగు రోజులు జాగ్రత్తగా ఉండాలన్న ఐఎండీ!

Over Heat in Telugu States
  • విజయవాడలో అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత
  • చాలా ప్రాంతాల్లో 43 డిగ్రీలు దాటిన వేడిమి
  • ఉపరితల ద్రోణి ప్రభావమన్న ఐఎండీ
భానుడి ప్రతాపానికి తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోతున్నారు. వడగాడ్పులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత మూడు రోజులుగా సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదవుతుండగా, మరో నాలుగు రోజులు ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయని వాతావరణ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ వరకూ 900 మీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని ఐఎండీ అధికారులు పేర్కొన్నారు.

దీని ప్రభావంతోనే ఉష్ణోగ్రత అధికంగా నమోదవుతోందని వెల్లడించిన అధికారులు, మరో నాలుగు రోజులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాగా, శనివారం నాడు విజయవాడలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా, పలు పట్టణాల్లో ఎండ వేడిమి 43 డిగ్రీలు దాటింది.
IMD
Summer
Vijayawada
Heat

More Telugu News