Chandrababu: హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లేందుకు చంద్రబాబు దరఖాస్తు... ఓకే చెప్పిన తెలంగాణ, పెండింగ్ లో పెట్టిన ఏపీ!

Chandrababu apply for Permission to Leave Hyderabad
  • మార్చి 20న హైదరాబాద్ కు వచ్చిన చంద్రబాబు
  • ఆపై లాక్ డౌన్ తో అప్పటి నుంచి భాగ్యనగరిలోనే
  • గ్యాస్ ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వెళ్తాను
  • ఏపీ, టీఎస్ డీజీపీలను అనుమతి కోరిన చంద్రబాబు
లాక్ డౌన్ కు ముందు హైదరాబాద్ కు వచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆపై ఇక్కడే ఉండిపోయారన్న సంగతి తెలిసిందే. తాను ఏపీకి వెళ్లేందుకు అనుమతించాలని చంద్రబాబు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగా, తెలంగాణ ప్రభుత్వం నుంచి వెంటనే అనుమతి లభించింది. ఏపీ సర్కారు మాత్రం దాన్ని పెండింగ్ లో పెట్టింది. తాను హైదరాబాద్ నుంచి నేరుగా విశాఖపట్నం వెళ్లి, ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ బాధితులను పరామర్శిస్తానని ఏపీ డీజీపీకి లేఖ రాస్తూ, ఆపై ఆన్ లైన్ లో రెండు రాష్ట్రాల డీజీపీలనూ అనుమతి కోరారు.

తెలంగాణ డీజీపీ కార్యాలయం వెంటనే అనుమతి మంజూరు చేయగా, ఏపీ డీజీపీ కార్యాలయం ఇంకా స్పందించలేదు. కాగా, మార్చి 20న హైదరాబాద్ కు వచ్చిన చంద్రబాబు, అప్పటి నుంచి ఇక్కడే ఉండిపోయారన్న సంగతి తెలిసిందే. తాను సోమవారం ఉదయం 10.35 గంటలకు బయలుదేరి విశాఖ వెళతానని చంద్రబాబు తన దరఖాస్తులో కోరారు. విశాఖలో బాధితులను పరామర్శించిన అనంతరం రోడ్డు మార్గాన అమరావతి చేరుకుంటానని తెలిపారు.
Chandrababu
Lockdown
Andhra Pradesh
Hyderabad
DGPs
Vizag
LG Polymers

More Telugu News