Chandrababu: దర్శకేంద్రుడు వెండితెరపై ఇంద్రజాలం చేసి ప్రేక్షకులను మెప్పించారు: చంద్రబాబు

Chandrababu wishes tollywood director Raghavendrarao on his birthday
  • ఇవాళ దర్శకుడు రాఘవేంద్రరావు పుట్టినరోజు
  • ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
  • నిండు నూరేళ్లూ వర్ధిల్లాలని ఆకాంక్ష
తెలుగు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక ఒరవడి సృష్టించుకుని, భారీ హిట్లు తన ఖాతాలో వేసుకున్న దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దర్శకేంద్రుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వెండితెరపై సృజనాత్మకతతో ఇంద్రజాలాన్ని చేసి ప్రేక్షకులను సమ్మోహితులను చేసిన శతాధిక చిత్రాల దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. "ప్రేక్షకులకు పది కాలాల పాటు గుర్తుండిపోయే చిత్రాలను అందించిన మీరు ఆనంద, ఆరోగ్యాలతో నిండునూరేళ్లూ వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను" అంటూ స్పందించారు.
Chandrababu
Raghavendra Rao
Birthday
Wishes
Tollywood
Telugudesam
Andhra Pradesh

More Telugu News