Vijayasai Reddy: ఒంటరిని చేసి మట్టుపెట్టాలని చూశారు: విజయసాయిరెడ్డి

One year for Jagans historical win says Vijayasai Reddy
  • తొమ్మిదేళ్ల పాటు ఎన్నో కుట్రలు చేశారు
  • అయినా ఆ ధైర్యం ముందు ప్రత్యర్థులు తోక ముడవక తప్పలేదు
  • ఏకపక్ష విజయంతో జగన్ చరిత్రను తిరగరాశారు
అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీని మట్టికరిపించి, వైసీపీ ఘనవిజయం సాధించి నేటికి సరిగ్గా ఒక ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తనదైన శైలిలో ట్విట్టర్ ద్వారా స్పందించారు.

'ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నవశకానికి నాంది పలుకుతూ ప్రజా తీర్పు వెలువడిన ఈరోజు చిరస్మరణీయం. తొమ్మిదేళ్ల పాటు ఎన్నెన్ని కుట్రలు. జైలుకు పంపారు. అభిమన్యుడిలా ఒంటిరివాడిని చేసి మట్టుపెట్టాలని చూశారు. కర్ణుడిలా అశక్తుడిని చేసి హతమార్చాలని స్కెచ్చులు వేశారు. ఆ గుండె ధైర్యం, పట్టుదల ముందు ప్రత్యర్థులు తోక ముడవక తప్పలేదు. ప్రజలకు జీవితకాల భరోసాగా నిల్చాడు యువనేత జగన్.

ఏడాది క్రితం ఇదే రోజు, ‘ఫ్యాన్’ ప్రభంజనాన్ని దేశమంతా కళ్లార్పకుండా చూసింది. ఏకపక్ష విజయంతో చరిత్రను తిరగరాశారు జననేత జగన్ గారు. తన వెంట నడిచిన ప్రజల కోసం ‘పది తలల విషనాగు’తో పోరాడారాయన. వ్యవస్థల్ని భ్రష్టుపట్టించి, వేల కోట్లు వెదజల్లిన పచ్చ పార్టీని పాతాళానికి తొక్కారు' అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
Vijayasai Reddy
Jagan
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News