chennai: సినీ నటి వాణిశ్రీ కుమారుడు హఠాన్మరణం

vanisri son passes away
  • గుండెపోటులో అభినయ్ వెంకటేశ్ మృతి
  • చెన్నైలోని నివాసంలో నిద్రలోనే కన్నుమూత
  • ప్రకటించిన వాణిశ్రీ కుటుంబం
అలనాటి అందాల సినీ నటి వాణిశ్రీ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె కుమారుడు అభినయ్ వెంకటేశ్ (36) మృతి చెందాడు. చెన్నైలో నివాసం ఉంటోన్న ఆయన గుండెపోటుతో మృతి చెందినట్లు అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. తన నివాసంలో నిద్రలోనే ఆయన మృతి చెందినట్లు వివరించారు. వాణిశ్రీకి అభినయ్ తో పాటు, ఓ కుమార్తె కూడా ఉన్నారు.

ఈ రోజు తెల్లవారు జామున అభినయ్ మరణించినట్లు తెలుస్తోంది. చెన్నైలోని అన్నపూర్ణ మెడికల్ కాలేజీలో డాక్టర్ గా పనిచేస్తున్న ఆయనకు భార్య, ఓ కుమారుడు (4), కుమార్తె  ఉన్నారు. ఆయన భార్య కూడా వైద్యురాలే.
chennai
Tollywood
Tamilnadu

More Telugu News