Pooja Hegde: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

Pooja Hegde says she misses Hyderabadi Haleem
  • ఆ వంటకాన్ని మిస్ అవుతోందట!
  • రీమేక్ చేయనున్న సందీప్ రెడ్డి 
  • 'ఉప్పెన'కు ఓటీటీ నుంచి భారీ ఆఫర్   
*  ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలలో నటిస్తున్న అందాలభామ పూజా హెగ్డే ఈ లాక్ డౌన్ సమయంలో తనకు బాగా నచ్చిన ఓ ఫుడ్డుని మిస్ అవుతోందట. దాని గురించి చెబుతూ, 'ఈ రంజాన్ మాసంలో హైదరాబాదులో లభ్యమయ్యే హలీం వంటకాన్ని బాగా మిస్ అవుతున్నాను' అంటూ ఈ చిన్నది ట్వీట్ చేసింది.
*  మలయాళంలో హిట్టయిన 'అయ్యప్పనుమ్ కోషియం' చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ తెలుగులో రీమేక్ చేయనున్న సంగతి విదితమే. ఈ చిత్రానికి 'అర్జున్ రెడ్డి' ఫేం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించే అవకాశం వుంది. ప్రస్తుతం నిర్మాతలు ఈ విషయంలో ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారట.
*  లాక్ డౌన్ సమయంలో థియేటర్లు బంద్ కావడంతో విడుదల కాకుండా ఆగిపోయిన సినిమాలకు ఓటీటీ ప్లేయర్స్ నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలో సాయితేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న 'ఉప్పెన' చిత్రానికి కూడా ఓ ప్రముఖ ఓటీటీ ప్లేయర్ నుంచి 14 కోట్ల వరకు ఆఫర్ వెళ్లిందట. అయితే, చిత్ర నిర్మాణానికి అంతకంటే బాగా ఎక్కువ ఖర్చుపెట్టడం వల్ల తమకు వర్కౌట్ కాదని భావించిన చిత్ర నిర్మాతలు ఆఫర్ ని తిరస్కరించినట్టు సమాచారం.  
Pooja Hegde
Arjun Reddy
Sandeep Reddy
Vaishnav Tej

More Telugu News