Vellampalli Srinivasa Rao: కామెడీ కాకపోతే మరేంటి పవన్ కల్యాణ్?: మంత్రి వెల్లంపల్లి ఘాటు వ్యాఖ్యలు

AP Endoment minister Vellampalli fires on Pawan Kalyan
  • పురోహితులను ఆదుకోవాలన్న పవన్
  • ఇప్పటికే ఆర్థికసాయం చేశామన్న మంత్రి వెల్లంపల్లి
  • అయినపోయిన పెళ్లికి బాజాలు కొట్టొద్దంటూ వ్యంగ్యం
ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ జనసేనాని పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, లాక్ డౌన్ నేపథ్యంలో పురోహితులు ఇబ్బందులు పడుతున్నారని భావించి ప్రభుత్వం ఇప్పటికే ఆర్థికసాయం చేసిందని, అయినప్పటికీ పవన్ కల్యాణ్ పురోహితులను ఆదుకోవాలని డిమాండ్ చేయడం అర్థరహితమని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

"కామెడీ కాకపోతే ఏంటిది? ఇదివరకే ఓసారి సాయం చేశాం కదా. లక్షల పుస్తకాలు చదివి మతి భ్రమించినట్టుంది. పార్ట్ టైమ్ రాజకీయాలు చేసే ప్యాకేజీ పవన్ కల్యాణ్ మేల్కొనాలి. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. అయినా హైదరాబాదులో కూర్చున్న పవన్ కల్యాణ్ కు సంక్షేమ పథకాలు కనిపించడంలేదేమో!" అంటూ ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ పురోహితులపై కపట ప్రేమ చూపుతున్నారని, అయిపోయిన పెళ్లికి బాజాలు కొట్టడం ఎందుకని విమర్శించారు.
Vellampalli Srinivasa Rao
Pawan Kalyan
Priests
Help
Lockdown
Corona Virus
Andhra Pradesh

More Telugu News