Pawan Kalyan: జనసైనికుడు ఉన్నమట్ల లోకేశ్ ను ఆత్మహత్యాయత్నానికి ప్రేరేపించిన పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవాలి: పవన్ కల్యాణ్

Pawan Kalyan furious on Janasena member suicide incident
  • తాడేపల్లిగూడెంలో జనసేన కార్యకర్త ఆత్మహత్యాయత్నం
  • ఇసుక అక్రమ రవాణాపై ప్రశ్నించడంతో పోలీసులు వేధించారన్న పవన్
  • సీఐ రఘుపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్
తాడేపల్లిగూడెంకు చెందిన ఉన్నమట్ల లోకేశ్ అనే జనసేన పార్టీ కార్యకర్త పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం ఎంతో బాధాకరమని జనసేనాని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఉన్నమట్ల లోకేశ్ ను సీఐ రఘు వేధించినట్టు తమకు తెలిసిందని పవన్ పేర్కొన్నారు.

ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుని ప్రశ్నించినందుకు పోలీసులు వేధించడం నియంతృత్వాన్ని తలపిస్తోందని విమర్శించారు. ఓ జనసైనికుడ్ని వేధింపులతో ఆత్మహత్యాయత్నానికి ప్రేరేపించిన సీఐ రఘుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమాలను ప్రశ్నించిన వారిని వేధించడం చట్ట సమ్మతమా? అంటూ ఆగ్రహంతో ప్రశ్నించారు. తాము ప్రజలకే జవాబుదారీ తప్ప అధికార పక్షానికి కాదని పోలీసు అధికారులు గుర్తించాలని పవన్ హితవు పలికారు.
Pawan Kalyan
Unnamatla Lokesh
Police
CI Raghu
Janasena
Andhra Pradesh

More Telugu News