Chandrababu: ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న నిరసనలకు ప్రజలు మద్దతు తెలపండి: చంద్రబాబు

chandrababu fires on ap govt
  • ప్రభుత్వం గుట్టు చప్పుడు కాకుండా కరెంటు శ్లాబులు మార్చింది
  • చార్జీలు పెంచి ప్రజల మీద బిల్లుల భారం మోపడం అన్యాయం
  • విద్యుత్ చార్జీలు పెంచేది లేదని చెప్పి అధికారంలోకి వచ్చారు
  • ఇప్పుడిలా చేయడం మోసం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి మండిపడ్డారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ రోజు నిరసనలకు దిగుతున్నట్లు గుర్తు చేశారు.

'అసలే లాక్ డౌన్ వల్ల పనుల్లేక పేదలు, మధ్య తరగతి ప్రజలు ఆర్థికంగా కష్టాలు పడుతుంటే... ప్రభుత్వం గుట్టు చప్పుడు కాకుండా కరెంటు శ్లాబులు మార్చి, చార్జీలు పెంచి వాళ్ల మీద బిల్లుల భారం మోపడం అన్యాయం. విద్యుత్ చార్జీలు పెంచేది లేదని చెప్పి అధికారంలోకి వచ్చాక ఇలా చేయడం మోసం' అని ఆయన ట్వీట్ చేశారు.
 
'లాక్ డౌన్ నేపథ్యంలో 3 నెలల విద్యుత్ బిల్లులు రద్దు చేయాలి. ఆ తర్వాత కూడా పాత శ్లాబు విధానంలో చార్జీలు వసూలు చేయాలి. కరెంటు చార్జీల పెంపునకు నిరసనగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న నిరసనలకు ప్రజలు మద్దతు తెలపాలి' అని చంద్రబాబు నాయుడు కోరారు.
Chandrababu
Telugudesam
YSRCP

More Telugu News