Anupama: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

Anupama about her childhood dream
  • ఆత్రుతగా వున్నానంటున్న అనుపమ
  • కమలహాసన్ సీక్వెల్ లో కథానాయికలు
  • 12 నిమిషాల షార్ట్ ఫిలింలో త్రిష  
 *  'నటిని కావాలని చిన్నప్పటి నుంచీ కలలు కన్నాను.. నెరవేర్చుకున్నాను..' అంటోంది కథానాయిక అనుపమ పరమేశ్వరన్. 'అవును, సినిమాలంటే చిన్నప్పటి నుంచీ ఇష్టమే. ఈ నటన అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఈ వృత్తిని చాలా ప్రేమిస్తాను.. సెట్లో ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తాను. ఇప్పుడు లాక్ డౌన్ వల్ల షూటింగుకి దూరం కావడంతో బాధగా వుంది. మళ్లీ ఎప్పుడు సెట్లో అడుగు పెడతానా అని ఆత్రుతగా వుంది' అని చెప్పింది అనుపమ.
*  గతంలో వచ్చిన 'దేవర్ మగన్' చిత్రానికి కమలహాసన్ ఇప్పుడు సీక్వెల్ చేస్తున్నారు. తను కీలక పాత్ర పోషిస్తూ దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ఇక ఇందులో ఓ కీలక పాత్రను విజయ్ సేతుపతి పోషిస్తుండగా.. పూజా కుమార్, ఆండ్రియా కథానాయికలుగా నటిస్తారని తెలుస్తోంది.
*  పదేళ్ల క్రితం తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి వచ్చిన 'ఏ మాయ చేసావే' (తమిళంలో విన్నైతాండి  వరువాయ) చిత్రం అప్పట్లో పెద్ద హిట్టయింది. దీనికి తమిళంలో ఇప్పుడు సీక్వెల్ గా 12 నిమిషాల నిడివితో చిన్న షార్ట్ ఫిలిం తీశాడు దర్శకుడు గౌతమ్ మీనన్. త్రిష, శింబు నటించగా గౌతమ్ మీనన్ దీనిని ఐ ఫోన్ ద్వారా షూట్ చేశాడు. రెహ్మాన్ సంగీతాన్ని అందించడం మరో విశేషం. దీనిని నిన్న విడుదల చేశారు.  
Anupama
Kamalahassan
Vijay Setupati
Trisha

More Telugu News