Pawan Kalyan: ఈ విపత్కర సమయంలో పురోహితులకు నెలకు రూ.5 వేలు ఇవ్వాలి: పవన్ కల్యాణ్ డిమాండ్

pawan about corona crisis
  • పౌరోహిత్యంపై ఆధారపడ్డ  బ్రాహ్మణులకు ఆర్థిక భరోసా ఇవ్వాలి
  • ఎదుర్కొంటున్న కష్టాలను బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య తెలిపింది
  • బ్రాహ్మణ కార్పొరేషన్ నిధులను సక్రమంగా వినియోగించాలి 
ఏపీలో పౌరోహిత్యంపై ఆధారపడ్డ బ్రాహ్మణులకు ఆర్థిక భరోసా ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. బ్రాహ్మణ కార్పొరేషన్ నిధులను సక్రమంగా వినియోగించాలని ఆయన అన్నారు. ఈ మేరకు ఈ రోజు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పౌరోహిత్యంపై ఆధారపడ్డవారు ఎదుర్కొంటున్న కష్టాలను ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య సవివరంగా తెలియజేసిందని ఆయన తెలిపారు. కరోనా విపత్కర సమయంలో పురోహితులకు నెలకు రూ.5 వేలు, నిత్యావసర సరుకులు అందించాలని ఆయన కోరారు.                                      
               
Pawan Kalyan
Janasena
Corona Virus

More Telugu News