Maharashtra: నిచ్చెన సాయంతో బావిలోంచి బయట పడ్డ ఎలుగుబంట్లు.. వీడియో ఇదిగో
- మహారాష్ట్రలో ఘటన
- బావిలో పడ్డ ఎలుగులు
- విషయాన్ని గుర్తించిన అధికారులు
- బావిలోకి నిచ్చెన వేసిన సిబ్బంది
బావిలో పడ్డ ఎలుగుబంట్లు చాలా తెలివిగా బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్న ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. బావిలో పడ్డ రెండు ఎలుగు బంట్లు నీటిలోనే కొట్టుకుంటున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన గోండియాలో సాలెకాసా రేంజ్‌కు చెందిన అధికారులు వాటిని కాపాడే ప్రయత్నంలో భాగంగా బావిలోకి నిచ్చెన వేశారు.
దీంతో ఆ ఎలుగుబంట్లు నిచ్చెనను పట్టుకుని మనుషుల్లా ఎక్కుతూ బయటకు వచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ అధికారి సుశాంత నంద తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఎలుగు బంట్లు బయటపడిన తీరును ప్రశంసిస్తూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.