వైద్యుడు సుధాకర్‌ ఉన్న ఆసుపత్రికి వెళ్లి వాంగ్మూలం తీసుకోండి: హైకోర్టు కీలక ఉత్తర్వులు

sudhakar case on high court
  • విశాఖ సెషన్స్‌ జడ్జిని ఆదేశిస్తూ హైకోర్టు ఉత్తర్వులు
  • తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా
  • రేపు సాయంత్రంలోగా వాంగ్మూలాన్ని హైకోర్టుకు సమర్పించాలని ఆదేశం
విశాఖ వైద్యుడు సుధాకర్‌తో నడిరోడ్డుపై పోలీసులు దురుసుగా ప్రవర్తించి, అరెస్టు చేసిన విషయంపై ఏపీ హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సుధాకర్‌ ఉన్న ఆసుపత్రికి వెళ్లి వాంగ్మూలం నమోదు చేయాలని విశాఖ సెషన్స్‌ జడ్జిని ఆదేశిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. రేపు సాయంత్రంలోగా వాంగ్మూలాన్ని హైకోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.

కాగా, కరోనా నేపథ్యంలో తమకు మాస్కులు ఇవ్వకుండానే పనులు చేయమంటున్నారని, ఒక్కో మాస్కు చాలా రోజులు వాడమంటున్నారని ఆరోపించిన ప్రభుత్వ వైద్యుడు సుధాకర్‌ను అధికారులు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల క్రితం విశాఖపట్నంలో జాతీయ రహదారిపై ఆయన గొడవ చేస్తున్నారని పోలీసులు అరెస్టు చేయడం అలజడి రేపింది.
Go Back to Shorts
sudhakar
AP High Court
Andhra Pradesh

More Telugu News