Genilia: చిరంజీవి సినిమాలో జెనీలియా?

Genelia come back film with Chiranjivi
  • పలు చిత్రాల ద్వారా అలరించిన జెనీలియా 
  • తెలుగులో కడపటి చిత్రం 'నా ఇష్టం'
  • సుజీత్ దర్శకత్వంలో 'లూసిఫర్' రీమేక్  
  • కీలక పాత్రకు జెనీలియా ఎంపిక 
 కొన్నాళ్ల క్రితం పలుచిత్రాల ద్వారా కథానాయికగా తెలుగు ప్రేక్షకులను అలరించిన జెనీలియా పెళ్లి తర్వాత సినిమాలకు బై చెప్పింది. బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్ ముఖ్ ని పెళ్లి చేసుకుని సంసార జీవితానికి పరిమితమైంది. తెలుగులో ఆమె నటించిన కడపటి చిత్రం రానా హీరోగా రూపొందిన 'నా ఇష్టం'. ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ ఇప్పుడు ఈ చిన్నది టాలీవుడ్ లో నటించడానికి ఆసక్తి చూపుతోంది. ఇదే సమయంలో తెలుగు నుంచి ఆమెకు ఓ ఆఫర్ వెళ్లింది. అదే చిరంజీవి నటించే చిత్రం కావడం విశేషం!

మలయాళంలో సూపర్ హిట్టయిన 'లూసిఫర్' చిత్రాన్ని చరణ్ తెలుగులో తన తండ్రి చిరంజీవి హీరోగా రీమేక్ చేస్తున్నాడు. దీనికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. 'ఆచార్య' సినిమా తర్వాత చిరంజీవి ఈ చిత్రాన్నే చేయనున్నారు. ఇందులో ఓ కీలక పాత్ర కోసం జెనీలియాను సంప్రదించినట్టు తాజా సమాచారం. ఆమె కూడా ఈ పాత్ర చేయడానికి ఆసక్తిని చూపుతోందట. సో.. అమ్మడి టాలీవుడ్ పునఃప్రవేశం చిరంజీవి చిత్రం ద్వారా జరిగే ఛాన్స్ వుందన్న మాట!  
Genilia
Ritesh Deshmukh
Chiranjeevi
Charan
Sujeeth

More Telugu News