Mahindra and Mahindra: మహీంద్రా సూపర్ ఆఫర్లు.. వాహనం ఇప్పుడు కొని ఏడాది తర్వాత చెల్లించేలా పథకాలు!

Mahindra and Mahindra Announces Special Offers to Covid Warriors
  • కోవిడ్ వారియర్లు, సాధారణ వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లు
  • గరిష్టంగా 8 ఏళ్లపాటు రుణ సౌకర్యం
  • వందశాతం ఆన్‌ రోడ్ ఫండింగ్
దేశంలోని ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా బ్రహ్మాండమైన ఆఫర్లతో ముందుకొచ్చింది. కోవిడ్-19 లాక్‌డౌన్ కారణంగా దెబ్బతిన్న వ్యాపారాన్ని తిరిగి పట్టాలెక్కించేందుకు వినూత్న ఫైనాన్స్ స్కీములను ప్రకటించింది. కోవిడ్ వారియర్లు అయిన పోలీసులు, వైద్యులకు కొన్ని, సాధారణ వినియోగదారుల కోసం మరికొన్ని ఫైనాన్స్ స్కీములను ప్రకటించింది.

వైద్యులు కనుక మహీంద్రా వాహనాన్ని కొనుగోలు చేస్తే ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు లేకుండానే రుణం మంజూరు చేస్తారు. అలాగే, డబ్బులు చెల్లించేందుకు మూడు నెలల మారటోరియం కూడా ఉంది.  వాహనాన్ని ఇప్పుడు తీసుకుని మూడు నెలల తర్వాత డబ్బులు చెల్లించొచ్చు.

అదే సాధారణ వినియోగదారులైతే ఏడాది తర్వాతి నుంచి ఈఎంఐ చెల్లించవచ్చు. మహీంద్రా ఎస్‌యూవీలపై వందశాతం ఆన్‌ రోడ్ ఫండింగ్ లభిస్తుంది. అదే, మహిళలు కనుక వాహనం కొనుగోలు చేస్తే 0.1 శాతం వడ్డీకే రుణం లభిస్తుంది. మూడు నెలలపాటు అతి తక్కువ ఈఎంఐ చెల్లిస్తూ ఆ తర్వాత దానిని పెంచుకునే సౌలభ్యాన్ని కల్పించింది. గరిష్టంగా 8 ఏళ్లపాటు ఈ సదుపాయం అందుబాటులో ఉంది.
Mahindra and Mahindra
Offers
SUVs
COVID-19
Lockdown

More Telugu News