Vijayashanti: నాగబాబు ట్వీట్ కు విజయశాంతి కౌంటర్!

Vijayashanti Strong Reply on Nagababu Tweet
  • గాడ్సేను దేశభక్తుడన్న నాగబాబు
  • గాడ్సే ఇప్పుడు బతికున్నా గాంధీని ప్రార్థించేవాడు
  • 'మహాత్మా మన్నించండి' అంటూ విజయశాంతి ట్వీట్
మహాత్మా గాంధీని హత్య చేసిన నాథురాం గాడ్సే 'నిజమైన దేశ భక్తుడు' అంటూ మెగా బ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ వివాదాస్పదం కాగా, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్ పర్సన్, సీనియర్ నటి విజయశాంతి తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు.

"కుల, మతాలు వేరైనా దైవం ఒక్కటే.. ఎన్ని తరాలైనా జాతిపితా ఒక్కడే... 130 కోట్ల మంది భారతీయులకు మహత్ముడు ఒక్కడే... ఈశ్వర్, అల్లా... తేరానామ్... సబ్ కో సన్మతి దే భగవాన్... ''నాకు కూడా''...''అని'' గాడ్సే, ఇప్పుడు బ్రతికుంటే... ఈ జన్మదినం నాడు ఇదే ప్రార్ధించేవాడు. మన్నించండి మహత్మా" అని ట్వీట్ చేయగా, అదిప్పుడు వైరల్ అవుతోంది.

కాగా, తీవ్ర విమర్శలు కొని తెచ్చిన తన ట్వీట్ పై నాగబాబు వివరణ కూడా ఇచ్చారు. తనను అర్థం చేసుకోవాలని, అతను చేసిన నేరాన్ని తాను సమర్థించలేదని, అతని మనసులోని అభిప్రాయం ప్రజలకు తెలియాలని మాత్రమే అన్నానని చెప్పారు.
Vijayashanti
Nagababu
Twitter
Gadse

More Telugu News