Charmme: బాలకృష్ణ ఎంతో పాజిటివ్ గా ఉంటారు: చార్మి

Charmme tells about Balakrishna
  • బాలయ్య, పూరీ జగన్నాథ్ మధ్య మంచి అనుబంధం ఉందన్న చార్మి
  • బాలయ్యతో సినిమాకు పూరీ ఎప్పుడూ రెడీ అని వెల్లడి
  • స్క్రిప్టు కుదరాలంటూ వ్యాఖ్యలు
నటనకు దూరంగా ఉంటున్న చార్మి దర్శకుడు పూరీ జగన్నాథ్ తో కలిసి చిత్ర నిర్మాణ రంగంలో దూసుకుపోతోంది. తాజాగా ఆమె అగ్రహీరో బాలకృష్ణపై స్పందించారు. బాలయ్య ఎంతో పాజిటివ్ గా ఉండే వ్యక్తి అని చెప్పారు. బాలకృష్ణ, పూరీ జగన్నాథ్ మధ్య మంచి అనుబంధం ఉందని తెలిపారు. బాలకృష్ణతో సినిమా అంటే కథకు ప్రాధాన్యత ఉంటుందని, ఆయనతో సినిమాకు పూరీ ఎప్పుడూ రెడీ అని వ్యాఖ్యానించారు. స్క్రిప్టు కుదిరితే ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందని చెప్పారు. ఇన్ స్టాగ్రామ్ లైవ్ సందర్భంగా చార్మి ఈ వివరాలు తెలిపారు.
Charmme
Balakrishna
Movie
Puri Jagannadh
Tollywood

More Telugu News