ఆయా హీరోల గురించి అడిగితే... హీరోయిన్ లావణ్య త్రిపాఠి సమాధానాలివి!

Lavanya Tripati Openions on Tollywood Heros
  • నెటిజన్లతో సంభాషించిన లావణ్య
  • 'రంగస్థలం' అంటేనే ఓ అద్భుతం
  • 'ఆర్ఆర్ఆర్' లుక్ కోసం వేచి చూస్తున్నా
తొలి చిత్రం 'అందాల రాక్షసి' కమర్షియల్ గా అంత విజయం సాధించకున్నా, వరుసగా అవకాశాలను పొందిన బ్యూటీ లావణ్య త్రిపాఠి, కాసేపు నెటిజన్లతో చిట్ చాట్ చేస్తూ, ఏ హీరోపై తన అభిప్రాయం ఎలాంటిదన్న విషయాన్ని ఏదీ దాచుకోకుండా చెప్పింది. నెటిజన్లు ఒక్కో హీరో ప్రస్తావన తెస్తుంటే, ఒక్కో సమాధానం చెబుతూ వెళ్లింది. ప్రభాస్ పేరెత్తగానే చాలా కూలెస్ట్ గా ఉంటాడని చెప్పింది. రామ్ చరణ్ అంటే ఓ అద్భుతమని, ఆయన నటించిన 'రంగస్థలం' తనకు చాలా ఇష్టమైన సినిమా అని వెల్లడించింది.

ఇక జూనియర్ ఎన్టీఆర్ ను ఎవరూ మ్యాచ్ చేయలేరని, ఆయన తాజా చిత్రం 'ఆర్ఆర్ఆర్' లో లుక్ కోసం వెయిట్ చేస్తున్నానంది. షారూఖ్ నటించిన చిత్రాల్లో 'చక్ దే ఇండియా' ఇష్టమని వెల్లడించింది. అల్లు అర్జున్ పేరు ప్రస్తావనకు రాగానే, 'పుష్ప' ఫస్ట్ లుక్ చింపేసిందని, ఇంకో బ్లాక్ బస్టర్ ఖాయంగా వస్తుందన్న నమ్మకం ఉందని చెప్పింది.

పవన్ కల్యాణ్, ప్రతి విషయంపైనా స్పందిస్తారని, ఆయన ధైర్యంపై తనకు ఎంతో గౌరవం ఉందని, నిజమైన హీరో మెగాస్టార్ చిరంజీవని, తాను ఆరాధించే నటుల్లో ఆయన ఒకరని తెలిపింది. చిరంజీవి చాలా మంచి వ్యక్తని, ఆయనలోని దయాగుణం, వినయం తనకు ఆదర్శమని పేర్కొంది.
Go Back to Shorts
Lavanya Tripathi
Tollywood
Netizens

More Telugu News