Pawan Kalyan: ఎల్జీ పాలిమర్స్ బాధితుల విషయంలో ప్రభుత్వం సరిగా స్పందించకపోతే ఉద్యమం తప్పదు: పవన్ కల్యాణ్

Pawan Kalyan demands AP government take appropriate measures for Vizag gas leak victims
  • జనసేన నేతలతో పవన్ వీడియో కాన్ఫరెన్స్
  • గ్యాస్ లీక్ బాధితులకు జనసేన అండగా ఉంటుందని వెల్లడి
  • డా.సుధాకర్ ను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్

విశాఖ జిల్లా జనసేన నేతలతో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎల్జీ పాలిమర్స్ బాధితుల అంశంలో ప్రభుత్వం సరిగా స్పందించకపోతే ఉద్యమం చేస్తామని స్పష్టం చేశారు. గ్యాస్ లీక్ బాధితులకు జనసేన అండగా ఉంటుందని తెలిపారు. అంతేగాకుండా, పేదలను మభ్యపెట్టకుండా అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వ ఆస్తుల వేలం, అధిక విద్యుత్ బిల్లులు, మద్యం అమ్మకాలపై క్షేత్రస్థాయి నుంచి పోరాడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇటీవల సస్పెండైన డాక్టర్ సుధాకర్ ను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News