Pawan Kalyan: తమ్ముడూ... పవన్ కల్యాణ్ సినిమా స్క్రిప్ట్, మ్యూజిక్ పనులు జరుగుతున్నాయి: హరీశ్ శంకర్

Pawan Kalyans film script and music works are going on says Harish Shanker
  • పవన్ తో సినిమా చేయమని కోరిన  అభిమాని
  • పవన్ కల్యాణ్ సినిమా తర్వాతే మరే కమిట్ మెంట్ అయినా అన్న హరీశ్
  • నేనూ మీలాంటి అభిమానే అంటూ వ్యాఖ్య
పవన్ కల్యాణ్ తో మరో సినిమా చేయడంపై టాలీవుడ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ స్పష్టతనిచ్చాడు. ఎన్ని సినిమాలు అయినా చేయన్నా.. కానీ తదుపరి సినిమా పవర్ స్టార్ తో చేయి అంటూ ఓ అభిమాని చేసిన విన్నపానికి హరీశ్ స్పందించాడు. 'తమ్ముడూ... పవర్ స్టార్ మూవీ స్క్రిప్ట్ వర్క్, మ్యూజిక్ వర్క్ కొనసాగుతున్నాయి. పవన్ కల్యాణ్ చిత్రం తర్వాతే మరే కమిట్ మెంట్ అయినా. నేను కూడా మీలాంటి అభిమానే అని మర్చిపోకు' అని సమాధానం ఇచ్చాడు.

మరోవైపు... 'గద్దలకొండ గణేశ్' చిత్రం తర్వాత  పవర్ ఫుల్ డైరెక్టర్ హరీశ్ శంకర్ తో మరోసారి పని చేయబోతుండటం సంతోషంగా, గర్వంగా ఉందని 14 రీల్స్ సంస్థ ప్రకటించింది. లాక్ డౌన్ అనంతరం, పరిస్థితులన్నీ సర్దుకున్న తర్వాత పూర్తి వివరాలను ప్రకటిస్తామని తెలిపింది. ఈ ప్రకటన పట్ల హరీశ్ శంకర్ స్పందించాడు. 'మీ ప్రపోజల్ తో చాలా ఎక్సైట్ అవుతున్నా. ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడానికి వేచి ఉండలేను' అని ట్వీట్ చేశారు.
Pawan Kalyan
Janasena
Harish Shanker
Tollywood
New Film

More Telugu News