Chiranjeevi: 'తాను.. నేను.. కాలం మారినా... దేశం మారినా...' అంటూ చిరు ఆసక్తికర ఫొటో పోస్ట్!

chiranjeevi Times change things remain same to same
  • భార్యతో 1990లో ఫొటో
  • మళ్లీ ఇప్పుడు వంట చేస్తూ ఫొటో
  • అచ్చం అప్పటిలాగే పోజులిస్తూ వంట
'తాను.. నేను.. కాలం మారినా... దేశం మారినా...' అంటూ మెగాస్టార్ చిరంజీవి ఓ ఆసక్తికర ఫొటో పోస్ట్ చేశారు. దాదాపు 30 ఏళ్ల క్రితం తన భార్యతో కలిసి వంట చేస్తోన్న ఫొటోను, లాక్‌డౌన్‌ నేపథ్యంలో తాజాగా వంట చేసిన ఫొటోను ఆయన పోస్ట్ చేశారు.                          
         
               
'1990లో అమెరికాలో జాయ్‌ఫుల్ హాలీడే.. 2020 కరోనాతో 'జైల్‌' ఫుల్ హాలీడే' అంటూ సరదా వ్యాఖ్యను జోడించారు. అప్పుడు ఎలా ఫొటో దిగారో, ఇప్పుడూ అదే పోజులిచ్చి ఫొటో దిగారు. అప్పట్లో ఏ రంగు దుస్తులు వేసుకున్నారో ఇప్పుడు కూడా అదే రంగు దుస్తులతో ఫొటో దిగి పోస్ట్ చేశారు. కొన్ని నెలల క్రితమే సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన చిరు పలు ఆసక్తికర పోస్టులతో, వ్యాఖ్యలతో అలరిస్తున్నారు.
Chiranjeevi
Tollywood
Corona Virus
Lockdown

More Telugu News