Lockdown: భార్య పుట్టింటిలో చిక్కుకుపోవడంతో.. భర్త మరో పెళ్లి!

Wife Starnded in Lockdown Another Marriage by Husbend
  • ఉత్తరప్రదేశ్ లోని బరేలీ జిల్లాలో ఘటన
  • పుట్టింట్లో చిక్కుకుపోయిన నసీమ్
  • ఇదే అదనుగా మరో పెళ్లి చేసుకున్న భర్త
తన భార్య లాక్ డౌన్ లో చిక్కుకుందన్న కారణంతో మరో వివాహం చేసుకున్న ప్రబుద్ధుడి ఘటన ఉత్తరప్రదేశ్ లోని బరేలీ జిల్లాలో జరిగింది. బాధితురాలు నసీమ్ కథనం ప్రకారం, 2013లో నయీమ్ మన్సూరీ అనే వ్యక్తితో నసీమ్ వివాహం జరిగింది. వారికి ముగ్గురు పిల్లలు. లాక్ డౌన్ కు ముందు మార్చి 19న ఆమె తన తల్లిదండ్రులను చూసేందుకు పుట్టింటికి వెళ్లింది. అదే సమయంలో నిబంధనలు అమలులోకి వచ్చి, ప్రజా రవాణా మొత్తం ఆగిపోవడంతో అక్కడే చిక్కుకుపోయింది.

తన భార్య రావడం లేదన్న ఆక్రోశంతో మరో బంధువుల అమ్మాయిని నయీమ్ మన్సూరీ పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న నసీమ్, తనకు సహాయం చేయాలంటూ 'మేరా హక్' అనే స్వచ్ఛంద సంస్థను ఆశ్రయించింది. లాక్ డౌన్ లో నసీమ్ చిక్కుకుపోతే, మరో వివాహం చేసుకుని ఆమెకు అన్యాయం చేశాడని, ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తామని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు ఫర్హాత్ నఖ్వీ పేర్కొన్నారు. 
Lockdown
Marriage
Uttar Pradesh

More Telugu News