కృష్ణా జలాల వినియోగంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం!
- జూరాల వద్ద మరో ప్రాజెక్టు
- సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని సీఎం ఆదేశాలు!
- ముంపు ప్రాంతాలు లేని రీతిలో భారీ రిజర్వాయర్ కు సన్నాహాలు
నీటిపారుదల అంశాలపై తాజాగా జరుగుతున్న సమీక్షలో ఈ ప్రాజెక్టుపై చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే థరూర్ మండలం గూడెం దొడ్డి, ద్యాగాదొడ్డి గ్రామాల నడుమ కొత్త ప్రాజెక్టుకు అనువైన ప్రదేశం ఉన్నట్టు నీటిపారుదల శాఖ తన నివేదికలో పేర్కొంది. నూతన రిజర్వాయర్ నుంచి నెట్టంపాడు, భీమా-1, భీమా-2, కోయిల్ సాగర్ కు లింక్ ఏర్పాటు చేసి 30 రోజుల్లోనే 15 నుంచి 20 టీఎంసీలు ఎత్తిపోసేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేసినట్టు తెలుస్తోంది. ప్రధానంగా ముంపు ప్రాంతాలు లేనివిధంగా భారీ రిజర్వాయర్ నిర్మించనున్నట్టు తెలుస్తోంది.