Silver Mask: ఏ మాత్రం తగ్గని ధనవంతులు... వేడుకల కోసం వెండి మాస్క్ లు!

Silver Masks for Celebrations in Karnataka
  • కర్ణాటకలో తయారవుతున్న మాస్క్ లు
  • ఒక్కొ మాస్క్ ధర రూ. 3 వేల వరకూ
  • తమ డాబు చూపించేందుకు పోటీ
కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు మాస్క్ లు ధరించడం తప్పనిసరైన పరిస్థితుల్లో ధనవంతులు తమ డాబును చూపించడానికి వినూత్న మార్గాన్ని అన్వేషించి పోటీ పడుతున్నారు. వివాహాది శుభకార్యాలకు వచ్చే కొద్దిమందికి కూడా మాస్క్ లు తప్పనిసరి కావడంతో వెండి మాస్క్ లను తయారు చేయిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి, చిక్కోడి తదితర ప్రాంతాల్లో వెండి మాస్క్ లకు డిమాండ్ అధికంగా ఉంది. వీటి ధర ఒక్కొక్కటీ రూ. 2,500 నుంచి రూ. 3 వేల వరకూ పలుకుతోందని సమాచారం. 
Silver Mask
Celebrations
Karnataka

More Telugu News