New zealand: కాబోయే భర్తతో కలిసి రెస్టారెంట్‌కు న్యూజిలాండ్ ప్రధాని.. సీట్లు లేవని చెప్పి నిలబెట్టిన యాజమాన్యం

Kiwis PM Jacinda rejected from cafe at corona virus capcity
  • క్లార్క్ గేఫోర్డ్‌తో కలిసి రెస్టారెంట్‌కు జసిండా
  • సీట్లు ఖాళీ లేవని చెప్పి నిలబెట్టిన యాజమాన్యం
  • నొచ్చుకోకుండా వేచి చూసిన ప్రధాని
న్యూజిలాండ్ ప్రధాని జసిండా అర్డెర్న్‌కు ఓ రెస్టారెంట్‌లో చేదు అనుభవం ఎదురైంది. కాబోయే భర్తతో కలిసి కాసేపు సరదాగా గడిపేందుకు ఓ రెస్టారెంట్‌కు వెళ్తే సాక్షాత్తూ దేశ ప్రధాని అని తెలిసినా నిర్వాహకులు కాసేపు ఆమెను వెయిట్ చేయించారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. కాబోయే భర్త క్లార్క్ గేఫోర్డ్‌తో కలిసి జసిండా నిన్న దేశ రాజధాని వెల్లింగ్టన్‌లోని ఆలివ్ రెస్టారెంట్‌కు వెళ్లారు.

అయితే, అప్పటికే కుర్చీలన్నీ నిండిపోవడంతో కాసేపు వేచి చూడాలని రెస్టారెంట్ నిర్వాహకులు ప్రధానిని కోరారు. దీంతో ఆమె ఏమాత్రం నొచ్చుకోకుండా సీట్లు ఖాళీ అయ్యేంత వరకు వేచి చూశారు. అయితే, ఎంతకీ ఖాళీ కాకపోవడంతో వెనుదిరిగారు. సరిగ్గా అప్పుడే ఓ మేనేజర్ వారి వద్దకు పరుగున వచ్చి సీట్లు ఖాళీ అయ్యాయని చెప్పడంతో ప్రధాని జసిండా, క్లార్క్‌లు తిరిగి రెస్టారెంట్‌లోకి వెళ్లారు.

కాగా, దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో రెండు రోజుల క్రితమే ఆంక్షలు సడలించడంతో రెస్టారెంట్లు తెరుచుకున్నాయి.
New zealand
Restaurent
Jacinda Ardern
Clarke Gayford

More Telugu News