Pothireddypadu: పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు అంశంపై పూర్తి వివరాలు, వాస్తవాలు ఇవ్వండి!: కేఆర్ఎంబీకి కేంద్రమంత్రి ఆదేశం

Centre respond to Bandi Sanjay letter on Pothireddypadu issue
  • వివాదాస్పదంగా మారిన పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు
  • తీవ్రంగా మండిపడుతున్న తెలంగాణ బీజేపీ
  • జోక్యం చేసుకోవాలంటూ కేంద్రానికి లేఖ రాసిన బండి సంజయ్
కృష్ణా నదిపై పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంపు నిబంధనలకు విరుద్ధమని, ఈ అంశంలో ఏపీని నిలువరించాలంటూ తెలంగాణ బీజేపీ తీవ్రంగా స్పందిస్తోంది. అంతేకాదు, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్రానికి లేఖ రాశారు. బండి సంజయ్ లేఖకు కేంద్ర జలవనరుల మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పందించారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు అంశంపై పూర్తి వివరాలు, వాస్తవాలు తెలియజేయాలని కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)ను షెకావత్ ఆదేశించారు. అంతేకాదు, ఈ అంశంలో ఏపీ ముందుకెళ్లకుండా ఆపాలని కేఆర్ఎంబీకి స్పష్టం చేశారు.
Pothireddypadu
Bandi Sanjay
Centre
Gajendra Singh Shekhawat
Andhra Pradesh
Telangana

More Telugu News