Chandrababu: రైతులు, రైతు కూలీలు, మహిళలు చేస్తున్న ఈ పోరాటం ఒక చరిత్ర: చంద్రబాబు
- అమరావతి పరిరక్షణ ఉద్యమం ప్రారంభమై 150 రోజులు
- కులముద్రలు, అవమానాలు, అరెస్టులు, లాఠీ దెబ్బలు..
- ప్రభుత్వం పెట్టిన అన్నిరకాల హింసలనూ తట్టుకున్నారు
- ఆవేదనతో 64 మంది రైతులు గుండెపోటుతో మరణించారు
అమరావతి పరిరక్షణ ఉద్యమం ప్రారంభమై 150 రోజులు అవుతున్న నేపథ్యంలో ఈ పోరాటంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. 'కులముద్రలు, అవమానాలు, అరెస్టులు, లాఠీ దెబ్బలు... ఇలా ప్రభుత్వం పెట్టిన అన్నిరకాల హింసలనూ తట్టుకుని అమరావతి కోసం రైతులు, రైతు కూలీలు, మహిళలు చేస్తున్న పోరాటం ఒక చరిత్ర' అని ఆయన అన్నారు.
రాజధానిని తరలిస్తే తమ భవిష్యత్తు ఏమవుతుందోనన్న ఆవేదనతో 64 మంది రైతులు గుండెపోటుతో మరణించారని ఆయన చెప్పారు. రైతులకు తమ పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.