VH: కేసీఆర్ పోతిరెడ్డిపాడును జగన్ కు అప్పగించేశారు: వీహెచ్ వ్యంగ్యం

Congress senior leader VH slams Telangana government
  • ఏపీ, తెలంగాణ మధ్య 203 జీవో చిచ్చు
  • దక్షిణ తెలంగాణ ఎడారిగా మారబోతోందన్న వీహెచ్
  • ప్రశ్నిస్తే విపక్షాల గొంతు నొక్కుతున్నారని వ్యాఖ్యలు
ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 203 జీవో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి కేంద్రబిందువుగా నిలుస్తోంది. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు స్పందించారు. సీఎం కేసీఆర్ పోతిరెడ్డిపాడును ఏపీ సీఎం జగన్ కు అప్పగించేశారంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కృష్ణా జలాలు అందని నేపథ్యంలో దక్షిణ తెలంగాణ ఎడారిగా మారబోతోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఏదేనీ అంశంపై గట్టిగా ప్రశ్నిస్తే ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని వీహెచ్ ఆరోపించారు.

అటు కరోనా అంశంపైనా ఆయన తన అభిప్రాయాలు వెల్లడించారు. కరోనా కట్టడిలో కేసీఆర్ ఒట్టిమాటలు చెబుతున్నారని విమర్శించారు. కేంద్రం ఇస్తున్న నిధులు, దాతల విరాళాలకు లెక్కా పత్రం లేదంటూ ఆరోపణలు చేశారు. పేదలకు ఇచ్చిన 1500 రూపాయలను వైన్ షాపులు తెరవడం ద్వారా ప్రభుత్వమే లాక్కుందని మండిపడ్డారు.
VH
KCR
Pothireddy Padu
GO203
Telangana
Andhra Pradesh

More Telugu News