Revanth Reddy: ఏపీ ప్రభుత్వం జారీచేసిన 203 జీవోపై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించాలి: రేవంత్ రెడ్డి

Revanth Reddy demands Telangana government should respond on AP GO
  • ఏపీ ప్రభుత్వ జీవో 203పై తెలంగాణ కాంగ్రెస్ నేతల అసంతృప్తి
  • ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శిని కలిసిన రేవంత్ తదితరులు
  • తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని విజ్ఞప్తి
తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల అంశం వివాదం రేకెత్తించింది. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 203 జీవోపై తెలంగాణ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా ఈ అంశంలో కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి, ప్రసాద్ కుమార్ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిని కలిశారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 203 జీవోపై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.. తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని అన్నారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లాల రైతులకు నీళ్లిచ్చి ఆదుకోవాలని కోరారు. 
Revanth Reddy
Congress
Telangana
Andhra Pradesh
GO203

More Telugu News