బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కారులో మద్యం సీసాల తరలింపు.. పట్టుకున్న పోలీసులు
- బీహార్లో అమలులో మద్య నిషేధం
- నలుగురు నిందితుల అరెస్ట్
- అంతా కుట్ర అంటున్న ఎమ్మెల్యే
నిందితులు మద్యం తరలిస్తున్న కారు ఎమ్మెల్యే పేరున రిజిస్టర్ అయినట్టు ఎస్పీ పేర్కొన్నారు. తన కారులో మద్యం బాటిళ్లు లభించడంపై ఎమ్మెల్యే తివారీ స్పందించారు. తనను అప్రదిష్ట పాలు చేసేందుకు ఎవరో పథకం ప్రకారం తన కారులో మద్యం సీసాలు పెట్టి ఉంటారని ఆరోపించారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.