కరోనా భయం.. కన్నతండ్రినే ఇంట్లోకి అడుగుపెట్టనివ్వని కుమారులు
- తూర్పుగోదావరిలోని సోదరుడి ఇంటికి వెళ్లిన వృద్ధుడు
- ఈ నెల 10న తెనాలి చేరుకున్న వైనం
- ఇంట్లోకి రావొద్దనడంతో రోడ్డుపైనే ఉండిపోయిన తండ్రి
పట్టణానికి చెందిన వృద్ధుడు (60) తూర్పుగోదావరి జిల్లాలో నివసించే తన తమ్ముడి ఇంటికి మార్చిలో వెళ్లాడు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో అక్కడే చిక్కుకుపోయాడు. ఈ నెల పదో తేదీన ఎలాగోలా తిరిగి తెనాలిలోని ఇంటికి చేరుకున్నాడు. అయితే, కోవిడ్ భయం కారణంగా తండ్రిని ఇంట్లోకి అడుగుపెట్టకుండా కుమారులు అడ్డుకున్నారు. దీంతో ఆయన రోడ్డుపైనే ఉండసాగాడు. అయితే, విషయం తెలుసుకున్న పోలీసులు కుమారులకు కౌన్సెలింగ్ ఇచ్చి వృద్ధుడిని ఇంట్లోకి పంపడంతో సమస్య సద్దుమణిగింది.