Telangana: తెలంగాణలో ఈరోజు మరో 41 పాజిటివ్ కేసులు.. వీటిలో 31 హైదరాబాదులోనే!

Telangana corona virus bulletin
  • ఈరోజు మరో ఇద్దరి మృతి
  • మొత్తం కేసుల సంఖ్య 1,367
  • మొత్తం మరణాల సంఖ్య 34
తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు కొత్తగా 41 కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మృతి చెందారు. మరణించిన ఇద్దరూ హైదరాబాదుకు చెందినవారే కావడం గమనార్హం. కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 31 కేసులు నమోదయ్యాయి. మిగిలిన 10 కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారి వల్ల నమోదయ్యాయి.

దీంతో, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,367కి చేరింది. మరణించిన వారి సంఖ్య 34కి చేరుకుంది. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 394 కాగా... ఆసుపత్రుల్లో కోలుకుని, డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 939కి చేరింది. వరంగల్ రూరల్, యాదాద్రి, వనపర్తి జిల్లాలలో ఇప్పటి వరకు కేసులు నమోదు కాలేదు. మరో 26 జిల్లాల్లో 14 రోజుల నుంచి కొత్త కేసులు నమోదవలేదు.
Telangana
Corona Virus
Death
Cases

More Telugu News