Chengalrayudu: డార్విన్ సిద్ధాంతానికి మించి జగన్ కొత్త సిద్ధాంతాన్ని కనిపెట్టారు: టీడీపీ నేత చెంగల్రాయుడు సెటైర్లు

  • డార్విన్ సిద్ధాంతం ప్రకారం కోతి నుంచి మనిషి
  • జగన్ సిద్ధాంతం ప్రకారం మనిషి నుంచి కోతి పుడుతుంది. 
  • మద్యం ధరలు పెంచితే వినియోగం తగ్గుతుందట!  
  • ఏపీలో విద్యుత్ బిల్లులను ముట్టుకుంటేనే షాక్ కొడుతోంది
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధికార ప్రతినిధి చెంగల్రాయుడు తీవ్ర విమర్శలు చేశారు. డార్విన్ సిద్ధాంతానికి మించి జగన్ కొత్త సిద్ధాంతాన్ని కనిపెట్టాడని సెటైర్లు విసిరారు. డార్విన్ సిద్ధాంతం ప్రకారం కోతి నుంచి మనిషి పుడితే, జగన్ సిద్ధాంతం ప్రకారం మనిషి నుంచి కోతి పుడుతుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

రాష్ట్రంలో మద్యం ధరలు పెంచితే వినియోగం తగ్గుతుందని చెప్పడం జగన్ కు మాత్రమే చెల్లిందని విమర్శించారు. రాష్ట్రంలో విద్యుత్ ధరలు పెంచడంపైనా ఆయన విరుచుకుపడ్డారు. లాక్ డౌన్ లో ప్రజలకు పనులు లేక ఇబ్బందులు పడుతుంటే విద్యుత్ ఛార్జీలు పెంచడం సబబు కాదని అన్నారు. కరెంట్ ను పట్టుకుంటే షాక్ తగులుతుంది కానీ, ఏపీలో కరెంట్ బిల్లులను పట్టుకుంటేనే షాక్ తగులుతోందంటూ ప్రభుత్వం తీరును దుయ్యబట్టారు.
Chengalrayudu
Telugudesam
Jagan
YSRCP

More Telugu News