'కొంటెగాణ్ణి పట్టుకో..' పాటకు పీటర్సన్ డ్యాన్స్.. వీడియో షేర్ చేసిన ఏఆర్ రెహమాన్
- ఇప్పటికే బుట్టబొమ్మ పాటకు డ్యాన్స్
- ఇప్పుడు మరో దక్షిణాది సినిమా పాటకు స్టెప్పులు
- తనదైన శైలి హావభావాలతో కూడిన డ్యాన్స్
ఆయన డ్యాన్స్‌కు అభిమానులే కాదు.. దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కూడా ఫిదా అయిపోయారు. పీటర్సన్ చేసిన కొంటెగాణ్ణి పట్టుకో (ఒట్టగత్తి కట్టికో) పాటను ఏఆర్ రెహమాన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. 'జెంటిల్‌మ్యాన్' సినిమాలోని ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ వీడియో షేర్ చేశారు.