Elephant: ఏనుగు మనసు అలా మామిడి పళ్ల మీదకు లాగింది.. వైరల్ వీడియో ఇదిగో!

Elephant Tastes Yummy Mango video goes viral
  • మామిడి పండ్లను నేల రాలుస్తున్న గజరాజు
  • ఆపై వాటిని నోట్లో వేసుకుంటున్న వీడియో
  • షేర్ చేసిన ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుశాంత్ నందా
వేసవి కాలం పేరు వింటేనే తొలుత గుర్తుకు వచ్చేది మామిడి పండ్లే ననడంలో సందేహం లేదు. చిన్నా, పెద్దా తేడా లేకుండా మామిడి పళ్ళు తినేందుకు ఉత్సాహం చూపుతారు. ఇక విషయానికి వస్తే, చెట్టుపైనే బాగా పండిన పండ్ల రుచి ఎలా ఉంటుందన్న విషయం ఓ ఏనుగుకు తెలిసిపోయింది. అందుకే, అది జాగ్రత్తగా పండ్లను నేల రాలుస్తూ, వాటిని నోట్లోకి పంపిస్తున్న ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. తరచూ జంతువులకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేసే భారత ఫారెస్ట్ అధికారి సుశాంత నందా ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా అది వైరల్ అయింది.

"ఇది మామిడి పళ్ల సీజన్. పండ్లలోనే రారాజుగా చెప్పుకునే మామిడిని ఈ భారీ గజరాజం రుచి చూడకుండా ఎలా ఉండగలదు. అందుకే చెట్టుని మెల్లగా ఊపుతూ.. రాలిన పళ్లను రుచి చూస్తోంది" అంటూ కామెంట్ చేస్తూ వీడియోను పోస్ట్ చేశారు సుశాంత నందా. ఆ వీడియోను మీరు కూడా తిలకించవచ్చు.
Elephant
Mangos
Twitter

More Telugu News