Chiranjeevi: చివరికి భల్లాలదేవుడు కూడా మన్మథ బాణానికి పడిపోయాడంతే: రానా-మిహీక అంశంలో చిరంజీవి స్పందన

Chiranjeevi congratulate Rana on his revelation
  • శుభవార్త చెప్పిన రానా
  • తన ప్రియురాలు ఓకే చెప్పిందంటూ పోస్టు
  • రానా, మిహీకాలకు శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
టాలీవుడ్ నటుడు దగ్గుబాటి రానా ఎంతో కూల్ గా తన ప్రేయసి మిహీకా బజాజ్ ను పరిచయం చేసినా, సోషల్ మీడియాలో ఇప్పుడది హాట్ టాపిక్ గా మారింది. ఆమె తన ప్రతిపాదనకు అంగీకరించింది అంటూ రానా పోస్టు చేయడంతో కొద్దిసేపట్లోనే వైరల్ అయింది. దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. కంగ్రాచ్యులేషన్స్ మై బోయ్ అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు.

"చివరికి భల్లాలదేవుడి అంతటి బలశాలి కూడా మన్మథుడి ప్రభావానికి చిక్కుకున్నాడు. ఈ లాక్ డౌన్ మీ పెళ్లికి దారితీసింది. మీ ఇద్దరికీ ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను, శతమానం భవతి" అంటూ ట్వీట్ చేశారు. చిరు మాత్రమే కాదు, రానా స్నేహితుడు రామ్ చరణ్, నితిన్, దేవిశ్రీప్రసాద్, కాజల్ అగర్వాల్, సాయితేజ్ తదితరులు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు.
Chiranjeevi
Rana
Mihika Bajaj
Wed Lock
Tollywood

More Telugu News