Gadikota Srikanth Reddy: చంద్రబాబుకు టైంపాస్ కాక లేఖలు రాస్తున్నారు: వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి

YSCP leader Srikanthreddy criticises chandrababunaidu
  • ‘కరోనా’ కట్టడికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది
  • ప్రజలను అన్ని విధాలా ఆదుకుంటున్నాం
  • దుర్మార్గపు ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు
ఏపీ ప్రభుత్వానికి టీడీపీ నేత చంద్రబాబునాయుడు లేఖ రాయడంపై వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ప్రజలను అన్ని విధాలా ఆదుకుంటున్నామని అన్నారు. ‘కరోనా’ పెరిగిపోవాలనే దుర్మార్గపు ఆలోచనలో చంద్రబాబు ఉన్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. హైదరాబాద్ లో కూర్చున్న చంద్రబాబుకు టైంపాస్ కాకపోవడంతో ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారని దుయ్యబట్టారు.

లేఖలు రాయడంలో రికార్డు సాధించాలని చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు. లేఖలు రాయడం కాదు గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని పథకాలు అమలు చేశారో చూసుకోవాలని చంద్రబాబుకు సూచించారు. కష్టకాలంలో కూడా తాను ఇచ్చిన హామీలను సీఎం జగన్ నెరవేరుస్తున్నారని, ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నారని ప్రశంసించారు.  విశాఖలో గ్యాస్ లీకేజ్ ఘటనపై ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుంటే చంద్రబాబు విమర్శలు చేయడం తగదని అన్నారు.
Gadikota Srikanth Reddy
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News