Vizag Gas Leak: విశాఖ కేజీహెచ్ వద్ద గ్యాస్ లీక్ బాధితుల ఆందోళన!

  • మా ఆరోగ్యం మెరుగుపడకుండానే డిశ్చార్జి చేస్తున్నారు
  •  ఇంకా అనారోగ్యంగానే ఉన్న మమ్మల్ని ఎలా డిశ్చార్జి చేస్తారు?
  • ఈ పరిస్థితుల్లో తిరిగి మా గ్రామాలకు ఎలా వెళ్లాలి?
విశాఖపట్టణంలోని గ్యాస్ లీకేజ్ ఘటనలో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ఆరోగ్యం మెరుగుపడకుండానే తమను డిశ్చార్జి చేస్తున్నారని కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న బాధితులు ఆరోపిస్తూ నిరసనకు దిగారు.

'ఇంకా అనారోగ్యంగానే ఉన్న మమ్మల్ని ఎలా డిశ్చార్జి చేస్తారు? ఈ పరిస్థితుల్లో తిరిగి మా గ్రామాలకు ఎలా వెళ్లాలి?' అని ప్రశ్నిస్తున్నారు. తమను డిశ్చార్జి చేసేందుకు వైద్యులు ఏర్పాట్లు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందించే డబ్బులు తమకు వద్దని, సంపూర్ణ ఆరోగ్యంతో తమను ఇళ్లకు పంపించాలని కోరుతున్నారు.
Vizag Gas Leak
KGH
agitation

More Telugu News