Samantha: భర్తతో కలిసి సాహసయాత్రకు సిద్ధమవుతున్న సమంత... వన్ మిలియన్ లైక్స్!

Above One Million Likes for Samantha Pic
  • కారులో కూర్చున్న పాత ఫొటోను షేర్ చేసిన సమంత
  • క్యాప్షన్ యునీక్ గా ఉండటంతో లక్షల లైక్స్
  • వందల సంఖ్యలో కామెంట్లు కూడా
సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉండే సినీనటి అక్కినేని సమంత, తన ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన ఓ చిత్రం తెగ వైరల్ అయింది. గంటల వ్యవధిలో ఈ ఫొటోకు 10 లక్షలకు పైగా లైక్స్ రావడం గమనార్హం. అంతలా ఈ ఫొటోలో ఏముందని అనుకుంటున్నారా? పెద్దగా ఏమీ లేదు. దేశమంతా లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో ఓ పాత ఫొటోకు సమంత యునీక్ గా క్యాప్షన్ తగిలించడమే దీన్ని వైరల్ చేసింది.

"ఓ గొప్ప సాహసయాత్రకు మేము సిద్ధమవుతున్నాం... దాదాపుగా..." అంటూ డ్రైవింగ్ సీటులో నాగ చైతన్య, పక్కన సమంత, ఆమె చేతిలో వారి పెంపుడు కుక్క ఉన్న ఫొటోను షేర్ చేసుకుంది. ఇక ఈ ఫొటోకు వందల సంఖ్యలో కామెంట్లు వచ్చి పడుతున్నాయి. ప్రస్తుతం చైతూ 'లవ్ స్టోరీ' సినిమాతో బిజీగా ఉండగా, లాక్ డౌన్ తొలగించగానే షూటింగ్ ప్రారంభం కానుంది. సమంత చేతిలోనూ పలు చిత్రాలున్నాయి.                 
Samantha
Naga Chaitanya
Adventure
Instagram

More Telugu News