Venkaiah Naidu: మన్మోహన్‌ సింగ్ గారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని కోరుతున్నాను: వెంకయ్య నాయుడు

Venkaiah naidu on manmihan health
  • భారతీయ వైద్య విజ్ఞాన సంస్థ నిర్దేశకుడితో మాట్లాడాను
  • మన్మోహన్‌ సింగ్ గారి ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశాను
  • వారి ఆరోగ్యం కుదుటపడుతోందని తెలిసి సంతోషిస్తున్నాను 
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (87) ఛాతీ నొప్పితో రెండు రోజుల క్రితం ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయనకు ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. కొత్త మందులు ఇవ్వడంతో ఆయనకు జ్వరం వచ్చిందని ఇప్పటికే వైద్యులు తెలిపారు. దీనిపై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పందించారు. మన్మోహన్ కోలుకుంటున్నారని చెప్పారు.‌

'భారతీయ వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) నిర్దేశకుడితో మాట్లాడి మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్ గారి ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశాను. వారి ఆరోగ్యం కుదుటపడుతోందని తెలిసి సంతోషిస్తున్నాను. మన్మోహన్‌ సింగ్ గారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని కోరుతున్నాను' అని వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు.
Venkaiah Naidu
manmohan singh
India

More Telugu News