Tablighi Jamaat: తబ్లిగి సభ్యులను ఉగ్రవాదుల్లా చూడాలి.. బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

Tablighi Jamaat members should be dealt with like terrorists
  • ముజఫర్‌పూర్ ఎంపీ అజయ్ నిషాద్ వ్యాఖ్యలతో కలకలం
  • దేశంలో ఈ పరిస్థితికి వారే కారణమని మండిపాటు
  • మదర్సాల్లో పంక్చర్లకు మరమ్మతు మాత్రమే నేర్పిస్తారని విమర్శలు
తబ్లిగి జమాత్ సభ్యులపై బీజేపీ ముజఫర్‌పూర్ ఎంపీ అజయ్ నిషాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాపించడానికి కారణమైన నిజాముద్దీన్ తబ్లిగి జమాత్ మర్కజ్ సభ్యులను ఉగ్రవాదుల్లా చూడాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తన నియోజకవర్గమైన బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

దేశంలో నేడు ఈ పరిస్థితికి తబ్లిగీలే కారణమని, కాబట్టి వీరిని ఉగ్రవాదుల్లా భావించాలని అన్నారు. అక్కడితో ఆయన ఆగలేదు.. మదర్సాలపైనా విరుచుకుపడ్డారు. అక్కడ నేర్పేది ఏమీ లేదని, పంక్చర్లకు మరమ్మతులు ఎలా చేయాలో మాత్రమే అక్కడ నేర్పిస్తారని, అందువల్లే వీరు మహమ్మారి వైరస్‌ను మరింత ప్రమాదకరంగా మార్చారని విరుచుకుపడ్డారు. నిషాద్ వ్యాఖ్యలపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Tablighi Jamaat
BJP MP
Bihar
Ajay Nishad

More Telugu News